మావోయిస్టుల ప్రతీకారం.. 8 మంది జవాన్లు మృతి

0
101

Times of Nellore ( Chhattisgarh ) – తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని అటవీ ప్రాంతం మరోసారి నెత్తురోడింది. ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా నష్టపోయిన మావోయిస్టులు అదను చూసి పంజా విసిరారు. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మంగళవారం వ్యాన్‌లో ప్రయాణిస్తుండగా గొల్లపల్లి-కిష్టరాం గ్రామాల మధ్య మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో 8 సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతిచెందగా.. మరో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రాయ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించారు. జవాన్ల మృతదేహాలను హెలికాప్టర్‌ ద్వారా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇటీవల తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణలోని తడపలగుట్ట, ఛత్తీస్‌గఢ్‌లోని పూజారికాంకేడు అటవీ ప్రాంతం సరిహద్దుల్లో ఈ కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో గ్రేహౌండ్స్ కు చెంది ఓ కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోయాడు.

SHARE

LEAVE A REPLY