మహాభారత యుద్ధం కంటే మూడు రోజులు ఎక్కువే: మోదీ

0
102

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- మహాభారత యుద్ధం 18 రోజులు జరిగిందని అయితే కరోనాపై యుద్ధం 21 రోజులు కొనసాగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వారణాసి ప్రజలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం కరోనాపై యుద్ధం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఐకమత్యంతో కరోనాను ఎదుర్కొందామని, ఇంట్లోనే ఉండి కరోనాను తరిమికొడదామని పిలుపునిచ్చారు. వారణాసి ప్రజలు దేశానికి స్ఫూర్తిగా నిలవాలని మోదీ ఆకాంక్షించారు.

”కరోనాపై 21 రోజుల్లో విజయం సాధిద్దాం. దేనికైనా మనసు ఉంటే మార్గం ఉంటుంది. సామాజిక దూరం పాటిస్తేనే కరోనాను నివారించగలం. ఏదైనా సందేహాలు ఉంటే 90131 51515 కి వాట్సాప్‌ చేయండి” అని మోదీ అన్నారు.

SHARE

LEAVE A REPLY