తుది దశ పోలింగ్‌లో పలు చోట్ల ఘర్షణలు

0
133

Times of Nellore (Delhi) #కోట సునీల్ కుమార్ # – సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్‌ సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మధ్యప్రదేశ్‌ రాట్లం నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బిహార్‌ పాటలీపుత్ర నియోజకవర్గ పరిధిలో బూత్ క్యాప్చరింగ్‌ జరిగినట్టు బీజేపీ ఫిర్యాదు చేసింది. యూపీలో డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీపై ఎస్పీ, బీఎస్పీ ఆరోపణలు చేసింది. కాగా మధ్యప్రదేశ్‌లో ఎన్నికల విధుల్లో ఉన్న ఇద్దరు అధికారులు గుండెపోటుతో మృతి చెందారు.

బెంగాల్‌లో జాదవ్‌పూర్‌ బీజేపీ అభ్యర్థి అనుపమ్‌ హజ్రా కారుపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారు. అదేవిధంగా ఉత్తర కోల్‌కతాలో బీజేపీ అభ్యర్థిపై దాడికి యత్నించారు. యూపీలో చందోలి నియోజకవర్గ పరిధిలో ఎస్పీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఆర్జేడీ నేత తేజస్వియాదవ్‌ ఓటరు గుర్తింపు కార్డుపై మరొకరి ఫొటో రావడంతో గందరగోళం నెలకొంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కబరిచారు. దీంతో తేజస్వియాదవ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

SHARE

LEAVE A REPLY