కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!

0
90

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –దీపావళిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. దీపావళి కానుకగా కరవు భత్యం 5 శాతం పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్‌ బుధవారం ప్రకటించారు. ఈ ఉదయం జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో సర్కారు ఉద్యోగులకు ఇచ్చే కరవు భత్యం 17 శాతానికి చేరినట్లు వెల్లడించారు. ఈ సరికొత్త విధానం వల్ల ప్రభుత్వంపై రూ.16వేల కోట్ల భారం పడనున్నట్లు తెలిపారు. సుమారు 62లక్షల మంది దీని వల్ల లబ్ధి పొందనున్నట్లు తెలిపారు.

SHARE

LEAVE A REPLY