కరుణానిధి అంత్యక్రియలు పూర్తి

0
232

Times of Nellore ( Chennai ) – మెరీనా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అన్నా స్వ్కేర్‌ ప్రాంగణంలో… ప్రభుత్వ లాంఛనాలతో కరుణానిధి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కరుణ భౌతిక కాయంపై జాతీయ జెండా కప్పి సైనికులు గౌరవ వందనం సమర్పించారు. కుటుంబ సభ్యులు అంతిమ నివాళులు సమర్పించిన అనంతరం.. కరుణానిధి పార్థీవదేహాన్ని కననం చేశారు. కరుణానిధి అంత్యక్రియల్లో తమిళనాడు గవర్నర్, ముఖ్యమంత్రి పళనిస్వామి, రాహుల్‌గాంధీ, ఆజాద్‌, శరద్‌పవార్‌, దేవెగౌడ, చంద్రబాబు, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. కరుణానిధిని కడసారి చూడటానికి వచ్చిన డీఎంకే శ్రేణులు, అభిమానులు కన్నీలు వీడ్కోలు పలికారు.

SHARE

LEAVE A REPLY