బీజేపీ శాసనసభా పక్ష నేతగా యెడ్యూరప్ప

0
231

Times of Nellore (bengaluru) – కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ప్రమాణం స్వీకారం చేయబోతున్నట్లు బీజేపీ శాసనసభా పక్ష నేత బీఎస్‌ యడ్యూరప్ప పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాలు హాజరుకాబోతున్నట్లు వెల్లడించారు.

ప్రమాణస్వీకారం కోసం బీజేపీ ఇప్పటికే ఏర్పాట్లను సైతం పూర్తి చేసినట్లు తెలిసింది. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన అనంతరం యడ్యూరప్ప ఎమ్మెల్యేలతో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌కు లేఖను సమర్పించిన విషయం తెలిసిందే. మరో వైపు ఒక స్వతంత్ర అభ్యర్థి బీజేపీకి మద్దతు ప్రకటించారు. దీంతో బీజేపీ బలం అధికారికంగా 105కు చేరుకుంది.మరోవైపు మిగిలిన ఎమ్మెల్యేల మద్దతు కోసం బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. ఈలోగా యడ్యూరప్ప తరచూ సంచలన ప్రకటనలు చేస్తూ కాంగ్రెస్‌-జేడీఎస్‌లలో గుబులు పుట్టిస్తున్నారు.

SHARE

LEAVE A REPLY