జియో మరో సంచలనం.. రూ. 2,500కే 5జీ స్మార్ట్ ఫోన్..!!

0
24

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒మొబైల్ టెలికాం రంగంలో ‘రిలయన్స్ జియో’ సంచలనాలకు కేంద్ర బిందువు. త్వరలోనే ఈ సంస్థ మరో సంచలనానికి నాంది పలకనుంది. సుమారు రూ. 2,500 నుంచి రూ. 3,000 మధ్య 5జీ స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ”రూ. 5 వేలలోపు స్మార్ట్ ఫోన్ తీసుకురావాలని జియో యోచిస్తోందని.. కానీ సేల్స్‌ను బట్టి రూ. 2,500 నుంచి రూ. 3,000 లోపే దాన్ని విక్రయించాలని అనుకుంటోందని ఆ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనిపై జియో నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

4జీ విషయంలో టెలికాం రంగాన్ని ఏలుతున్న రిలయన్స్ జియో.. సుమారు 20-30 కోట్ల మంది 2జీ వినియోగదారులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటీవల జరిగిన కంపెనీ మీటింగ్‌లో కూడా ‘2జీ ముక్త్ భారత్’ చేయాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్న సంగతి విదితమే.

SHARE

LEAVE A REPLY