జ‌య బ‌చ్చ‌న్‌, ఐష్, ఆరాధ్య‌‌ల‌కు క‌రోనా నెగిటివ్‌..!!

0
76

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒-ప్ర‌స్తుతం ముంబైలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు ఈ వైర‌స్ బారిన ప‌డ్డారు. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా కూడా ఈ వైర‌స్ మ‌హ‌మ్మారి వెంటాడుతూనే ఉంటుంది. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయ‌న‌ కుమారుడు అభిషేక్ బ‌చ్చ‌న్‌ల‌కు క‌రోనా సోకడంతో.. దేశం మొత్తం ఒక్క‌సారిగా షాక్‌కి గుర‌య్యింది. కాగా ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ ఐసోలేష‌న్ వార్డులో చికిత్స తీసుకుంటున్నారు. అమితాబ్‌ మూత్రపిండాల నొప్పితో బాధ‌ప‌డుతూ ఆస్పత్రిలో చేర‌గా.. ఆయ‌న‌కు వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. ఈ రిపోర్ట్స్‌లో బిగ్‌బీకి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇక అలాగే అభిషేక్ కూడా టెస్టు చేసుకోగా ఆయ‌నకి కూడా పాజిటివ్‌గా రిపోర్ట్ వ‌చ్చింది.

దీంతో కుటుంబ స‌భ్యులంద‌రికీ కోవిడ్ కేసులు నిర్వ‌హించారు వైద్యులు. అమితాబ్ భార్య‌ జ‌య బ‌చ్చ‌న్, కోడ‌లు ఐశ్వ‌ర్యారాయ్‌, మ‌న‌వ‌రాలు ఆరాధ్య‌కి కూడా టెస్టులు చేయ‌గా.. వారికి క‌రోనా నెగిటివ్ వ‌చ్చింది. దీంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అలాగే బిగ్‌బీ, అభిషేక్‌లు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటూ అభిమానులు సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

కాగా ఇక దేశంలో అత్య‌ధిక క‌రోనా పాజిటివ్ కేసులతో మ‌హారాష్ట్ర‌ మొద‌టి స్థానంలో ఉంది. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర‌లో 2,38,461 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 9,893 మంది మ‌ర‌ణించారు. ఇక అలాగే 95,943 యాక్టీవ్ కేసులు ఉండ‌గా, 1,32,625 మంది క‌రోనా బారి నుంచి కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

SHARE

LEAVE A REPLY