ఓటర్లకు ఉపరాష్ట్రపతి ‘4సీ’ సందేశం

0
103

Times of Nellore (Delhi) # కోట సునీల్ కుమార్ # – ఓటు వేసే ముందు అభ్యర్థిలో క్యారక్టర్‌(గుణం), కెపాసిటీ(సామర్థ్యం), క్యాలిబర్‌(యోగ్యత), కండక్ట్‌(నడత) అనే 4సీలు చూడాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాష్‌(డబ్బు), క్యాస్ట్‌(కులం), క మ్యూనిటీ(మతం), క్రిమినాలిటీ(నేరచరిత) అనే 4సీలు చూసి ఓటు వేయొద్దని సూచించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం దేశ ప్రజలకు ఆయన సందేశమిచ్చారు. అభ్యర్థుల పనితీరు, దేశ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇవ్వగలరా లేదా అనేది ఆలోచించి మంచి నాయకులను ఎన్నుకోవాలన్నారు.

SHARE

LEAVE A REPLY