బడ్జెట్‌ ఎఫెక్ట్‌.. భారీ నష్టాల్లో మార్కెట్లు!

0
217

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – కేంద్ర బడ్జెట్‌ ప్రతికూలతలు, ఆసియా మార్కెట్లు బలహీన సంకేతాలతో దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని భారీ నష్టాలతో ప్రారంభించాయి. దీనికి తోడు కంపెనీల ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసిక ఫలితాలపై దృష్టి పెట్టి మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫలితంగా నేటి ట్రేడింగ్‌ ఆరంభంలోనే సూచీలు కుప్పకూలాయి. మార్కెట్‌ ఆరంభంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా పతనమవగా.. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 11,700 మార్క్‌ను కోల్పోయింది. ఉదయం 9.45 గంటల సమయంలో సెన్సెక్స్‌ 402 పాయింట్లు నష్టపోయి 39,111 వద్ద, నిఫ్టీ 123 పాయింట్లు కోల్పోయి 11,687 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 68.58గా కొనసాగుతోంది. ఆటో మొబైల్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

SHARE

LEAVE A REPLY