కేంద్ర హోమ్ మంత్రిని కలిసిన గవర్నర్

0
69

Times of Nellore (Delhi) # కోట సునీల్ కుమార్ # – తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల రాజకీయ, పరిపాలన పరిస్థితులపై నివేదిక ఇచ్చారు. అంతేకాకుండా తెలుగు రాష్ర్టాల్లోని తాజా పరిస్థితులపై రాజ్‌నాథ్‌తో గవర్నర్ చర్చించినట్టు సమాచారం. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్‌ ఢిల్లీ పర్యటనకి వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఢిల్లీ పర్యటనలో భాగంగా గవర్నర్‌ నరసింహన్‌ ఈ రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరారు. ఇక ప్రతి నెలా అన్ని రాష్ట్రాల గవర్నర్లు ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులను కలవడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే.

SHARE

LEAVE A REPLY