ప్రభుత్వ పురుష ఉద్యోగులకు గుడ్ న్యూస్…!!

0
40

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒పురుష ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర మంత్రి గుడ్ న్యూస్ వినిపించారు. ఇక ముందు ఇలాంటి వారు కూడా చైల్డ్ కేర్ హాలిడేస్ తీసుకోవచ్చని తెలిపారు. ఒంటరిగా ఉంటున్న పురుష ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఇకపై శిశు సంరక్షణ సెలవులను వినియోగించుకోవచ్చని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌   తెలిపారు.

అలాంటి వారిని సింగిల్‌ మేల్‌ పేరెంట్‌గా పరిగణిస్తామని పేర్కొన్నారు. అవివాహితులు, భార్య మరణించిన వారు, విడాకులు తీసుకున్న వారు పిల్లలను సంరక్షించాల్సిన బాధ్యత ఉంటే.. ఈ సెలవులకు వారు ఖచ్చితంగా అర్హులని పేర్కొన్నారు. చైల్డ్‌ కేర్‌ లీవ్‌లో ఉన్నవారు లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్ ‌( LTC) కూడా పొందవచ్చని సూచించారు. శిశు సంరక్షణ సెలవులో ఉన్నవారికి మొదటి 365 రోజులు పూర్తి వేతనం చెల్లిస్తారు. మరో 365 రోజులు కూడా ఈ సెలవులో ఉంటే 80 శాతం వేతనం చెల్లిస్తారని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ అన్నారు.

SHARE

LEAVE A REPLY