సామాన్యుడి నెత్తిన గుదిబండ

0
64

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- సామాన్యుల నెత్తిన మరోమారు బండ పడింది. వంట గ్యాస్‌ ధర అమాంతం రూ.144.50 పెంచుతూ చమురు సంస్థలు బుధవారం నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో న్యూఢిల్లీలో 14.2 కేజీల గ్యాస్‌ ధర 858. 50కి చేరువైంది. గతంలో ఈ ధర రూ. 714గా ఉంది. కాగా, 2014 జనవరి తర్వాత గ్యాస్‌ ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అప్పట్లో రూ.220గా ఉన్న గ్యాస్‌ ధర..ఒక్కసారిగా రూ.1,241చేరుకున్న సంగతి తెలిసిందే. కోల్‌కతాలో సిలిండర్‌ ధర రూ.149 రూపాయలు పెరిగి..రూ.896లకు చేరుకుంది. ముంబయిలో రూ.145 పెరుగుదలతో రూ.829.50కు చేరుకుంది. చెన్నైలో రూ. 147 పెరిగి..రూ.881గా నమోదైంది.

వంట గ్యాస్‌ ధరతో పాటు కేంద్రం ఇచ్చే రాయితీని కూడా పెంచింది. గతంలో ఇచ్చిన రూ.153.86 రాయితీని రూ.291.48కి పెంచింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(పిఎంయువై) కింద లబ్ధి పొందిన వారికి ఆ రాయితీని మరింత పెంచింది. గతంలో రూ.174.86 ఉండగా…ఇప్పుడు రూ.312. 48లు చేసింది. సాధారణంగా ఎల్‌పిజి గ్యాస్‌ ధరలు చమురు సంస్థలు ప్రతి నెల మొదట్లో సమీక్షిస్తుంటాయి.. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల మార్పులే తాజా పెంపునకు కారణమని తెలుస్తోంది. ఇటీవల జనవరి 1న గ్యాస్‌ ధరలను పెంచాయి. కానీ ఈ సారి పెంపుదలకు రెండు వారాలు వాయిదా వేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈ ధరలు పెంపుదలను కేంద్రం వాయిదా వేసినట్లు పలువురు భావిస్తున్నారు.

SHARE

LEAVE A REPLY