శుభవార్త. ఫాస్ట్‌ట్యాగ్ పనిచెయ్యకపోతే మీ ట్రిప్ ఉచితం..!!

0
183

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒సంక్రాంతి పండుగకు పట్నం ఊరెళ్లింది. ట్రైన్‌కి వెళ్లినవాళ్ల సంగతి తెలీదుగానీ, రోడ్డు మార్గాన వెళ్లినవారు ట్రాఫిక్‌కి వల్ల చుక్కలు చూశారు. టోల్‌గేట్స్‌ వద్దే గంటలు, గంటలు సమయం వెచ్చించాల్సి వచ్చింది. మరోవైపు ఫాస్ట్‌ట్యాగ్ సరిగ్గా రీడ్ కాక వాహనదారులు తెగ తిప్పలు పడ్డారు. ఇక జనవరి 15 తర్వాత జాతీయ రహదారులపై ప్రయాణించాలి అంటే తప్పనిసరిగా ఫాస్ట్ ట్యాగ్ ఉండాల్సిందే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫాస్ట్‌ట్యాగ్‌ను నమ్ముకుంటే టెక్నికల్ సమస్యల వల్ల ప్రయాణం తలకు మించిన భారమవుతోంది. ఈ నేపథ్యంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. టోల్ ప్లాజాలో ఫాస్ట్‌ట్యాగ్ యంత్రాలు పనిచేయని పక్షంలో ఉచితంగానే వెళ్లిపోవచ్చు. ఈ మేరకు రూల్స్ సవరించింది ఎన్‌హెచ్‌ఏఐ. అయితే మీ వెహికల్ ఫాస్ట్ ట్యాగ్ ఖాతాలో బ్యాలెన్స్ ఉండాలి. అది సక్రమంగా పనిచేస్తూ ఉండేలా జాగ్రత్త పడాలి. అప్పుడే ఫ్రీ ట్రిప్‌కి అనుమతి ఉంటుంది.

క్యూలో ఆగిపోకుండా ప్రయాణికులు సమయాన్ని ఫాస్ట్ ట్యాగ్ కాపాడుతుంది. అంతేకాదు టోల్ దాటిన ప్రతి వాహనం స్కాన్ చేయబడటం చేత క్రైమ్స్ విషయంలో కూడా నేరస్థులను పట్టుకోవడం సులభతరం అవుతుంది. ఇక ఫాస్ట్ ట్యాగ్‌లు 22 సర్టిఫైడ్ బ్యాంకుల ద్వారా పొందవచ్చు. టోల్‌ప్లాజాల్లోనూ తీసుకునే సదుపాయం ఉంది. ఇటీవల వాటిని అమెజాన్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా అందుబాటులోకి తెచ్చారు. కస్టమర్లకు ఫాస్ట్ ట్యాగ్ సులభతరం చేయడానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యుపిఐ) కార్డులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు జారీ చేసిన ప్రీ-పెయిడ్ కార్డుల ద్వారా కూడా టోల్ చెల్లింపులు జరపొచ్చని తెలిపింది. కాగా ఇప్పటికే 1.10 కోట్ల ఫాస్ట్‌యాగ్‌లు జారీ చేయబడినట్లు ఎన్‌హెచ్‌ఏఐ నుంచి సమాచారం అందుతోంది.

SHARE

LEAVE A REPLY