విశ్రాంత న్యాయమూర్తితో విచారణ: సుప్రీం

0
135

Times of Nellore (Delhi) # కోట సునీల్ కుమార్ # – భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో కుట్రకోణాన్ని విచారణ జరిపేందుకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే పట్నాయక్‌ను సుప్రీంకోర్టు నియమించింది. ఈ విచారణకు సీబీఐ, నిఘా విభాగం డైరెక్టర్లు, దిల్లీ పోలీసు కమిషనర్‌లు సహకరించాల్సిందిగా కోరింది. సీజేఐపై కొందరు కావాలని కక్ష్య కట్టి ఈ కుట్ర పన్నుతున్నారని న్యాయవాది ఉత్సవ్‌ బైన్స్‌ అఫిడవిట్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం దీనిపై విచారణ చేపట్టిన ప్రత్యేక త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణ అవసరమని అభిప్రాయపడింది. విచారణ అనంతరం జస్టిస్‌ పట్నాయక్‌ నిజానిజాలను సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు నివేదిస్తారని ధర్మాసనం పేర్కొంది. విశ్రాంత న్యాయమూర్తితో విచారణ ఇన్‌ హౌజ్‌ విచారణకు అడ్డు కాబోదని కోర్టు స్పష్టం చేసింది.
‘‘ఈ రోజు రానే వచ్చింది. నేరం చేసిన శక్తిమంతులు, ఐశ్వర్యవంతులు కూడా కోర్టు పరిధి నుంచి తప్పించుకోలేరని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి.’’ అని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, ఆర్‌ఎఫ్‌ నారీమన్‌, దీపక్‌ గుప్తాతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

SHARE

LEAVE A REPLY