ఈసీ సంచలన నిర్ణయం

0
191

Times of Nellore (Delhi) #కోట సునీల్ కుమార్ #  – పశ్చిమబెంగాల్‌లో హింసాకాండ చెలరేగిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 16వ తేదీ ఉదయం 10 గంటల నుంచి బెంగాల్‌లోని తొమ్మిది పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.

గురువారం నుంచి ఎన్నికల ప్రచారం సస్పెండ్ అయిన నియోజవవర్గాల్లో డుమ్‌డుమ్, బరసత్, జేనగర్, మధురాపూర్, జాదవ్‌పూర్, డైమండ్ హార్బర్, సౌత్, నార్త్ కోల్‌కతా ఉన్నాయి. ఈ తరహాలో ఆర్టికల్ 324ను ఈసీఐ అమలు చేయడం ఇదే మొదటిసారి. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మంగళవారంనాడు జరిపిన రోడ్‌షో సందర్భంగా టీఎంసీ, బీజేపీ మద్దతుదారుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చేటుచేసుకున్న నేపథ్యంలో ఈసీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.

కాగా, ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్న కారణంగా హోం సెక్రటరీ పదవి నుంచి ఐఏఎస్ అధికారి అత్రి భట్టాచార్యను తొలిగిసున్నట్టు కూడా ఈసీ ప్రకటించింది. ఐపీఎస్ అధికారి రాజీవ్ కుమార్‌ను హోం మంత్రిత్వ శాఖకు రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశించింది.

SHARE

LEAVE A REPLY