రూంకి పిలిచి.. 17 ఏళ్ల బాలుడిపై యువతి లైంగిక దాడి..!

0
25185

Times of Nellore ( Delhi ) – సోషల్ మీడియా లో తనకు పరిచయం అయిన 17 ఏళ్ల బాలుడిపై ఫుల్ గా మందు కొట్టి 27 ఏళ్ల యువతి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలలోకి వెళితే.. వెస్ట్ ఢిల్లీ పరిధిలోని నజాఫ్ గఢ్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి కిషన్ గఢ్ కు చెందిన ఇంటర్ విద్యార్థికి సోషల్ మీడియాలో పరిచయం అయింది. నిత్యమూ అతనితో చాటింగ్ చేసే ఆ యువతి.. మహిపాల్ పూర్ లోని త్రీ స్టార్ హోటల్ లో రూం బుక్ చేసుకుని.. అతడిని అక్కడికి రమ్మని చెప్పింది. తదనంతరం.. ఫుల్లుగా తాగి, తనతో సెక్స్ చేయాలని ఒత్తిడి చేసింది. బాలుడు అందుకు నిరాక రించడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. బాలుడి ఫిర్యాదు మేరకు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు. అయితే.. బాలుడు తనను బలవంతంగా అత్యాచారం చేశాడని సదరు యువతి కూడా రివర్స్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇరువైపులా కేసులనూ నమోదు చేశామని.. విచారణ అనంతరం ఎవరు ఎవరిపై దాడి చేశారన్న విషయాన్ని తేల్చి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

SHARE

LEAVE A REPLY