పలు వెబ్‌సైట్లకు దిల్లీ హైకోర్టు బ్రేక్‌

0
208

Times of Nellore (Delhi) #కోట సునీల్ కుమార్ #  – ‘ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు సంబంధించిన ఆడియోను ప్రసారం చేస్తున్న 60 వరకు వెబ్‌సైట్లు, రేడియో ఛానెళ్లను దిల్లీ హైకోర్టు అడ్డుకుంది. ఆడియో సేవలను ప్రసారం చేయకుండా నిలువరించింది. ఈ మేరకు ఛానెల్‌-2 గ్రూప్‌ కార్పొరేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ జేఆర్‌ మిథా నేతృత్వంలో ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. సంబంధిత వెబ్‌సైట్లకు, రేడియో ఛానెళ్లకు, ఇంటర్నెట్‌, టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లతో పాటు కేంద్రానికి దీనిపై సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. దీనిపై సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ సెప్టెంబర్‌ 4కు తదుపరి విచారణను వాయిదా వేసింది. గూగుల్‌ సెర్చింజిన్‌తో పాటు ఇంటర్నెట్‌/టెలికాం సర్వీసు ప్రొవైడర్లు సంబంధిత వెబ్‌సైట్లకు సంబంధించిన లింకులను తొలగించాలని సూచించింది.

ప్రపంచకప్‌ 2019కు సంబంధించిన ఆడియో హక్కులను ఐసీసీ బిజినెస్‌ కార్పొరేషన్‌ నుంచి ఛానెల్‌ 2 గ్రూప్‌ కొనుగోలు చేసింది. సన్నాహక మ్యాచ్‌లతో సహా మ్యాచ్‌లకు సంబంధించిన ఆడియోను ప్రసారం చేసే హక్కను పొందింది. నిబంధనలకు విరుద్ధంగా కొందరు ఆడియోను ప్రసారం చేయడంపై ఆ గ్రూప్‌ కోర్టును ఆశ్రయించింది. దీనివల్ల తమకు ఆర్థికంగా నష్టం జరుగుతోందని వెల్లడించిన నేపథ్యంలో కోర్టు పైవిధంగా స్పందించింది. మే 30 నుంచి జులై 14 వరకు ఆడియో రైట్స్ ఛానెల్‌ 2 గ్రూప్‌నకు దాఖలు పడ్డాయి.

SHARE

LEAVE A REPLY