కాంగ్రెస్‌ పార్టీలో రాజీనామాల పర్వం!!

0
119

Times of nellore – ✒కోట సునీల్ కుమార్✒ – కాంగ్రెస్‌ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా ముంబయి కాంగ్రెస్‌ చీఫ్‌ మిలింద్‌ దేవ్‌రా తన పదవికి రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన రాహుల్‌కు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పార్టీలో జాతీయ స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి మహారాష్ట్ర అసెంబ్లీకి గడువు ముగుస్తున్న నేపథ్యంలో అప్పటి వరకు పార్టీని నడిపించేందుకు ముగ్గురు సీనియర్‌ నేతలతో కూడిన ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందు ముంబయి కాంగ్రెస్‌ చీఫ్‌గా నియమితులైన దేవ్‌రా.. గత నెల26న రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. అప్పుడే త్వరలో రాజీనామా చేస్తున్న విషయాన్ని ప్రకటించారు. రాజీనామా విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌కు చేరవేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ముంబయి సౌత్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దేవ్‌రా.. శివసేన అభ్యర్థి అర్వింద్‌ సావంత్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.

SHARE

LEAVE A REPLY