మరికాసేపట్లో రాహుల్‌తో భేటీ కానున్న చంద్రబాబు

0
177

Times of Nellore (Delhi)  #కోట సునీల్ కుమార్ #–  బీజేపీయేతర ఫ్రంట్‌కు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. నిన్న కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రాంతీయ పార్టీల అధిపతులతో సైతం సమావేశమవుతున్నారు. మేజిక్‌ ఫిగర్‌ దక్కనీయకుండ చేసి కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చంద్రబాబు విపక్ష నేతలకు వివరిస్తున్నారు. ఏపీ భవన్‌లో చంద్రబాబుతో అల్పాహర విందులో సురవరం సుధాకర్‌రెడ్డి, డి. రాజా తదితరులు పాల్గొన్నారు. మరి కాసేపట్లో చంద్రబాబు రాహుల్‌గాంధీతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం చంద్రబాబు లక్నో వెళ్లనున్నారు. నేటి సాయంత్రం 5 గంటలకు మాయావతితో సమావేశంకానున్నారు.

SHARE

LEAVE A REPLY