నేడు బెంగుళూరుకు చంద్రబాబు

0
78

Times of Nellore (Amaravati) – కోట సునీల్ కుమార్: రాబోవు ఎన్నికల్లో బిజెపి కూటమిని అధికారంలోకి రానియ్యకూడదనే పట్టుదలతో ఉన్న ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రయత్నల్లో భాగంగా నేడు బెంగుళూరుకు వెళ్లనున్నారు. తాజాగా కర్ణాటక ఉప ఎన్నికల్లో జెడిఎస్-కాంగ్రెస్ కూటమి ఘన విజయం నేపథ్యంలో కర్ణాటక సీఎం కుమారస్వామి…ఆయన తండ్రి, మాజీ ప్రధాని దేవగౌడతో సిఎం చంద్రబాబు భేటీ కానున్నారు. బిజెపి వ్యతిరేక పార్టీలను ఏకతాటి పైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఆయన ఇదే వారంలో డీఎంకే అధినేత స్టాలిన్‌, బీఎస్పీ అధినేత్రి మాయావ‌తిని కూడా కలవనున్నట్లు తెలిసింది. మాజీ ప్రధాని దేవగౌడ, ఆయన తనయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం సమావేశం కానున్నారు. వీరి సమావేశం బెంగళూరులోని పద్మనాభనగర్‌ ఉన్న దేవెగౌడ నివాసంలో జరగనున్నట్లు తెలిసింది. కేంద్రంలోని ఎన్డీఏతో ఢీ కొడుతున్న ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీని అధికారంలోకి రానిచ్చేది లేదని సవాలు విసురుతున్న సంగతి తెలిసిందే.

SHARE

LEAVE A REPLY