లక్షన్నర దాటిన కోవిడ్ మరణాలు!!

0
30

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.  బ్రెజిల్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసిన బులిటెన్ ప్రకారం కొత్తగా 713 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 1,52,460కు చేరినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ  తెలిపింది. కొత్తగా దేశంలో 28,523 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం కేసుల సంఖ్య 5169386 కు చేరినట్లు తెలిపింది. గురువారం బ్రెజిల్ కమ్యూనికేషన్స్ మంత్రి ఫాబియో ఫరియా కరోనా బారిన పడ్డారు. దీంతో బ్రెజిల్ క్యాబినెట్లో కరోనా బారిన పడిన సంఖ్య 11కు చేరింది. దేశంలో అధిక జనాభా ఉన్న, పారిశ్రామిక ప్రాంతమైన  సావో పాలో 1051613 పాజిటివ్ కేసులు 37,690 మరణాలతో వ్యాధి వ్యాప్తికి కేంద్ర బిందువుగా ఉంది.

SHARE

LEAVE A REPLY