బీజేపీ అభ్యర్థుల జాబితాలో మాధురీ

0
45

Times of Nellore (Mumbai)# కోట సునీల్ కుమార్ #: ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. పుణే లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమెను బరిలో దించనున్నట్టు తెలిపాయి. ఈ ఏడాది జూన్‌లో ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ కార్యక్రమంలో భాగంగా ముంబై వెళ్లిన బీజేపీ చీఫ్ అమిత్ షా.. మాధురీ దీక్షిత్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె పేరును వచ్చే లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో చేర్చాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ‘‘2019 సార్వత్రిక ఎన్నికల్లో మాధురీ దీక్షిత్‌కు టికెట్ ఇచ్చే అంశాన్ని బీజేపీ గట్టిగా పరిశీలిస్తోంది. పుణే లోక్‌సభ నియోజకవర్గం ఆమెకు బాగుంటుందని భావిస్తున్నాం..’’ సీనియర్ బీజేపీ నేత ఒకరు పేర్కొన్నారు. 51 సంవత్సరాల బాలీవుడ్ సీనియర్ నటి మాధురి.. ‘హమ్ ఆప్కే హైన్ కౌన్..!’, ‘దిల్‌ తో పాగల్ హై’, ‘సాజాన్ అండ్ దేవదాస్’ సహా పలు సూపర్ హిట్ చిత్రాల్లో అలరించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పుణే స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ నుంచి ఇక్కడ పోటీచేసిన అనిల్ శిరోలే దాదాపు 3 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

SHARE

LEAVE A REPLY