11 నుంచి ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం

0
114

Times of Nellore (Delhi)# కోట సునీల్ కుమార్ # – దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమవనున్న సందర్భంగా ఈనెల 11న ఉదయం 7 గంటల నుంచి మే 19వ తేదీ సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆర్‌పీ యాక్ట్‌-1951 సెక్షన్‌ 126(ఏ) ఆఫ్‌ సబ్‌సెక్షన్‌(1) ప్రకారం ఎగ్జిట్‌పోల్‌ను ఏ రూపంలో వెల్లడించినా, ప్రచురించినా, ప్రసారం చేసినా శిక్ష తప్పదని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన 48 గంటల దాకా ఒపీనియన్‌ పోల్‌, పోల్‌ సర్వేలను కూడా వెల్లడించరాదని ఆదేశించింది.

SHARE

LEAVE A REPLY