ఫేస్‌బుక్‌పై దాడి జరిగిందా?

0
85

Times of Nellore (HYd) # కోట సునీల్ కుమార్ # – భారత కాలమాన ప్రకారం బుధవారం రాత్రి 9 గంటల తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఫేస్‌బుక్ పనిచేయడం లేదు. భారత్‌లో నిన్న రాత్రి పది గంటల నుంచి ఈ సమస్య ఉంది. దీంతో ఫేస్‌బుక్ ఉపయోగించే వారికి ఇబ్బందులు తప్పలేదు. దీనికి సంబంధించి ట్విట్టర్‌ ద్వారా ఫేస్‌బుక్ తెలిపింది. సాంకేతిక సమస్యల వల్ల ఫేస్‌బుక్‌లో అంతరాయం ఏర్పడినట్లు అధికారికంగా ట్విట్టర్‌లో తెలిపారు. కానీ ఫేస్‌బుక్‌పై సైబర్ దాడి ఏమైనా జరిగిందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

SHARE

LEAVE A REPLY