ఏపీ, తెలంగాణ వివరణ కోరిన హోంశాఖ!

0
77

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-ఏపీ పునర్విభజన చట్టంపై దిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా నేతృత్వంలో కీలక సమావేశం ముగిసింది. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈసమావేశంలో షెడ్యూల్‌ 9, 10 జాబితాలోని సంస్థల విభజనపై ప్రధానంగా చర్చించారు. సింగరేణి కాలరీస్‌, ఆర్టీసీ, పౌరసరఫరా సంస్థలు, కార్పొరేషన్లపై కూడా చర్చ జరిగింది. సంస్థల విభజనపై రెండు రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలపై హోంశాఖ వివరణ కోరింది. సమావేశం ఫలప్రదంగా జరిగిందని ఇరు రాష్ట్రాల అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సీఎస్‌లు ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం, ఎస్‌.కె.జోషితో పాటు పలువురు ముఖ్యఅధికారులు సమావేశానికి హాజరయ్యారు.

SHARE

LEAVE A REPLY