కస్టమర్లకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

0
410

Times of Nellore (Delhi)  #కోట సునీల్ కుమార్ # – ఒక్కో ఖాతాదారుడి నుంచి లభించే సగ టు ఆదాయం (ఏఆర్‌పీయూ) పెంచుకునేందుకు ఎయిర్‌టెల్‌ కంపెనీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రూ.499 కంటే తక్కువ ఉండే పథకాలకు స్వస్తి చెబుతున్నట్టు సమాచారం. కంపెనీ ఇప్పటికే రూ.299 పోస్ట్‌పెయిడ్‌ పథకానికి గుడ్‌బై చెప్పింది. త్వరలో రూ.349, రూ.399 పోస్ట్‌పెయిడ్‌ పథకాలకూ స్వస్తి చెబుతుందని సమాచారం. రూ.499 కంటే ఎక్కువ ఉండే పోస్ట్‌పెయిడ్‌ పథకాల్లోనూ రూ.749, రూ.999, రూ.1,599లను మాత్రమే కొనసాగిస్తుందని భావిస్తున్నారు.

SHARE

LEAVE A REPLY