గల్లంతైన విమానం ఆచూకీ లభ్యం

0
171

Times of Nellore (Delhi)#కోట సునీల్ కుమార్ #  ఈనెల 3వ తేదీన గల్లంతైన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్‌‌-32 విమాన శకలాలను గుర్తించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని సియాంగ్‌ జిల్లా పయూమ్‌ పరిధిలో ఇది కూలిపోయింది. గత కొద్ది రోజులుగా భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌)తో పాటు, ఆర్మీ కూడా ఈ విమానం గురించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వైమానిక దళానికి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్‌ సాయంతో విమానం ఆచూకీ కోసం వెతుకుతుండగా సియాంగ్‌ జిల్లాలో దీనిని గుర్తించారు.

జూన్‌ 3న మధ్యాహ్నం 12.25గంటలకు అసోంలోని జోర్హాట్‌ వైమానిక స్థావరం నుంచి బయలుదేరి కొద్దిసేపటికే ఏఎన్‌-32 విమానం ఆచూకీ లభించలేదు. ఇది అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మారుమూల ఉన్న మెచుకా అడ్వాన్స్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్‌కు చేరుకోవాల్సి ఉండగా, సియాంగ్‌ జిల్లా పయూమ్‌ పరిధిలో కూలిపోయింది. ఇందులో 8మంది సిబ్బంది, ఐదుగురు ఇతర ప్రయాణికులతో సహా మొత్తం 13మంది ఇందులో ప్రయాణిస్తున్నారు. ‘విమాన శకలాలు దొరికిన నేపథ్యంలో అందులోని 13మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’ అని ఐఏఎఫ్‌ తెలిపింది

SHARE

LEAVE A REPLY