అబ్దుల్ కలాం జయంతి : వెంకయ్య నాయుడు భావోద్వేగ ట్వీట్!!

0
32

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ఇవాళ మాజీరాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి. ఈ సందర్బంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. “మాజీరాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. భారత రక్షణ వ్యవస్థకు అణుశక్తిని జోడించి మిసైల్ మ్యాన్‌గా, అధ్యాపకుడిగా, మేధావిగా, స్ఫూర్తిదాయక రచయితగా. భవిష్యత్ భారతానికి వారు చేసిన మార్గదర్శనం చిరస్మరణీయం. కలలు కనండి, వాటి సాకారానికి కృషిచేయండంటూ వారి ఉత్తేజపూరితమైన వ్యాఖ్యల అంతరార్థాన్ని అవగతం చేసుకుని యువత ముందడుగేయాలి. అసాధ్యాలను సుసాధ్యం చేసి ఎన్నో గౌరవ మర్యాదలు అందుకున్నా నిరాడంబరంగా సాగిన వారి జీవితం నుంచి ప్రతి ఒక్కరూ ప్రేరణ పొందాలని ఆకాంక్షిస్తున్నాను.” అంటూ వెంకయ్య నాయుడు ట్వీట్ చేసాడు.

SHARE

LEAVE A REPLY