అబ్బాయిగా మారలేదు…

0
97

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – గాయని నటి స్నిగ్ధ ని చూస్తే ఎవరికైనా అబ్బాయి ఏమో అనిపిస్తుంది. స్నిగ్ధ హెయిర్ స్టైల్, వస్త్రధారణ కూడా అబ్బాయిని తలపించే మాదిరిగానే ఉంటుంది. సినిమాల్లో కూడా తన లుక్ కూడా మగరాయుని మాదిరిగా ఉండడం తో , శ్రద్ధ అబ్బాయి గా మారిపోయిందనే ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్నిగ్ధ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భగవంతుడు తనని అమ్మాయిగా సృష్టించాడని … మంచి వాయిస్ ఇచ్చాడని… గాయనిగా ఇప్పుడిప్పుడే మంచి పేరు వస్తుందని చెప్పింది . అమ్మాయి వాయిస్ తో అబ్బాయి గా మారడానికి ఎందుకు ప్రయత్నిస్తానని ఎదురు ప్రశ్నించింది స్నిగ్ధ .

ఒకవేళ తాను అబ్బాయి గా మారాలి అనుకున్నా … అంత చిన్న విషయం కాదని చిటికలో జరిగే పని కూడా కాదన్నారు .తాను తనలాగే ఉంటానని … తనకు అబ్బాయి గా మారే అవసరం లేదని చెప్పుకొచ్చింది . తనగురించి ఎవరో ఏదో అనుకుంటే తనకు వచ్చే నష్టం ఏమీ లేదు అంటూ చెప్పింది స్నిగ్ధ . పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన స్నిగ్ధ , ఇటీవల గాయనిగా కూడా రాణిస్తోంది .

SHARE

LEAVE A REPLY