4జీ తో రాబోతున్న నోకియా ఫోన్లు ఇవే.. ధర ఎంతంటే..!!!

0
45

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒నోకియా 215 4జీ, నోకియా 225 4జీ ఫీచర్ ఫోన్లను భారత్ లో లాంఛ్ చేశారు. ఈ సరికొత్త ఫోన్లు 4G VoLTE కాలింగ్ ను సపోర్ట్ చేయడమే కాకుండా.. వైర్ లెస్ ఎఫ్.ఎం. రేడియా కూడా అందుబాటులో ఉంది. ఒక్క సారి ఛార్జింగ్ ఫుల్ చేస్తే 24 రోజుల పాటూ స్టాండ్ బై టైమ్ ఉండగలవట..! నోకియా 225 4జీ లో కెమెరా కూడా ఉంది. నోకియా 215 4జీ, నోకియా 225 4జీ మొబైల్స్ ను చైనాలో ఈ నెల మొదట్లో లాంఛ్ చేశారు.

నోకియా 215 4జీ, నోకియా 225 4జీ ధరలు:

నోకియా 215 4జీ ధరను భారత్ లో 2949 రూపాయలుగా నిర్ణయించారు. నోకియా 225 4జీ మొబైల్ ఫోన్ ధరను 3499 రూపాయలుగా నిర్ణయించారు. నోకియా 215 4జీ నలుపు, గ్రీన్ రంగు ఆప్షన్స్ లో రాబోతూ ఉండగా.. నోకియా 225 4జీ బ్లాక్, క్లాసిక్ బ్లూ, మెటాలిక్ శాండ్ షేడ్స్ రంగుల్లో దొరకనుంది. నోకియా 215 4జీ, నోకియా 225 4జీ మొబైల్స్ ను నోకియా ఇండియా ఆన్ లైన్ స్టోర్ లో అక్టోబర్ 23 నుండి లభించనుంది. నవంబర్ 6 నుండి ఆఫ్ లైన్ లో ప్రముఖ రీటైల్ షాపుల్లో లభించనున్నాయి. నోకియా 225 4జీ మొబైల్ ఫ్లిప్ కార్ట్ లో అక్టోబర్ 23 నుండి లభించనుంది.

నోకియా 215 4జీ, నోకియా 225 4జీ ఫీచర్లు:

నోకియా 215 4జీ, నోకియా 225 4జీ మొబైల్ ఫోన్లలో డ్యూయల్ సిమ్ (నానో), RTOS బేస్డ్ ఆన్ ది సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టమ్, 2.4-inch QVGA డిస్ప్లే. 128MB ఆన్ బోర్డు సపోర్టుతో వచ్చిన ఈ మొబైల్ ను మెమొరి కార్డు సహాయంతో 32జీబీ వరకూ పెంచుకోవచ్చు. 4G VoLTE, Bluetooth 5.0, FM radio, Micro-USB port, 3.5mm హెడ్ ఫోన్ జాక్ తో రానుంది. ప్రీ ఇంస్టాల్ MP3 ప్లేయర్ తో ఈ మొబైల్ రానుంది. 1,150mAh రిమూవబుల్ బ్యాటరీతో వచ్చింది. నోకియా 225 4G 0.3-మెగా పిక్సెల్ కెమెరా ఉంచారు.

 

SHARE

LEAVE A REPLY