దీపావళి టపాసులు పేల్చినందుకు 2100మందిపై కేసులు!

0
90

Times of Nellore (Chennai) –కోట సునీల్ కుమార్: దీపావళి పండుగ సందర్భంగా కేసులతో బెంబేలెత్తిస్తున్నారు తమిళనాడు పోలీసులు. సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. మంగళవారం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు అందిన లెక్కల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2100 కేసులు నమోదు చేసి… 650 మందిని అరెస్ట్ చేశారు. సుప్రీం ఆదేశాల మేరకు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు బాణాసంచా కాల్చాలని తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. ఈమేరకు నిబంధలను బేఖాతరు చేసిన వారిపై న్యూసెన్స్ కేసులు నమోదు చేశారు. చెన్నైలో అత్యధికంగా 344 మందిపై కేసులు నమోదు చేయగా.. కోయంబత్తూరులో 184 కేసులు, విల్లిపురంలో 160 కేసులు నమోదయ్యాయి. సెక్షన్ 291, 188, 268 కింద ఈ కేసులు నమోదు చేశారు.

SHARE

LEAVE A REPLY