ఇండోనేషియాకు సునామీ హెచ్చరిక..!

0
298

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – ఇండోనేషియాను భారీ భూకంపం వణికించింది. సులవేసి, నార్‌మాలుకు ద్వీపాల మధ్య మొలుక్కా సముద్రంలో ఈ భూకంపం సంభవించింది. 24 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ బీఎంకేజీ పేర్కొంది.

భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. భూకంపంతో టెర్నెటే నగరంలో ప్రజలు భయంతో పరుగులు తీశారు. భూకంప తీవ్రతకు నగరంలోని కొన్ని ఆసుపత్రులు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో ఆసుపత్రుల్లోని రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేనట్టు సమాచారం. కాగా.. భూకంపం కారణంగా అధికారులు 8 నగరాలకు.. అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో.. ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు పరుగులు తీస్తున్నారు.

SHARE

LEAVE A REPLY