షార్ట్ రివ్యూ : ఏడు చేపల కథ – టెంప్ట్ అవ్వడం ఖాయం!!

0
444

Times of Nellore – ఈరోజుల్లో నాల్గు మంచి మాటలు , రెండు పాటలు, రెండు ఫైట్స్ ను టీజర్ లో చూపిస్తే ఎవరు చూడడం లేదు..నాల్గు బెడ్ రూమ్ సీన్స్, నాల్గు హాట్ లిప్ లాక్ లు , వేడి పుట్టించే నాల్గు మసాలా డైలాగ్స్ ఉంటె చాలు జనాలు ఎగబడి చూస్తున్నారు.ఒకసారి చూడడం కాదు రోజుకు పది సార్లు చూసి వారి కోరిక తీర్చుకుంటున్నారు. అందుకే చాలామంది దర్శక , నిర్మాతలు ఇదే పద్దతిలో ముందుకు వెళ్తూ లాభాలు అందుకుంటున్నారు. తాజాగా విడుదలైన ఏడు చేపల కథ కూడా అదే కోవలోకి చెందింది. పూర్తి మసాలా అంశాలతో యూత్ ను థియేటర్స్ కు రప్పించే ప్రయత్నం చేసారు.

సినిమా చూసిన వారు ట్రైలర్ లో చూపించినంత సినిమాల్లో చూపించలేదని..కాకపోతే తెలుగు చిత్రాలలో ఈ రేంజ్ లో మసాలా అంశాలు ఉన్న చిత్రం ఇదే అని అంటున్నారు. టెంప్ట్ రవి పాత్రలో అభిషేక్ పచ్చిపాల ఆకట్టుకున్నాడని..అమ్మాయి కాస్త అందంగా కనిపిస్తే చాలు.. మనోడు తెగ టెంప్ట్ అయిపోతుంటాడు. డైరెక్టర్ ఏంచెప్పాలనుకున్నాడో అదే చెప్పాడు కానీ సెన్సార్ మాత్రం డైరెక్టర్ అనుకున్న సన్నివేశాలకు కత్తెర వేసింది. దాంతో అటు బూతు సినిమాకి తక్కువ, ఇటు మాములు సినిమాకి ఎక్కువ అన్నట్లు ఈ కథ సాగింది. మొత్తం మీద యూత్ మాత్రం ట్రైలర్ల పుణ్యమా అని ఒక్కసారైనా సినిమా చూస్తారు.

SHARE

LEAVE A REPLY