వైఎస్‌ జగన్‌ను కలిసిన ‘యాత్ర’ టీమ్‌

0
290

Times of Nellore (Hyd) # సూర్య #-  దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలి షో నుంచే సినిమాకు విశేష ప్రేక్షకాదరణ లభించడంతో చిత్ర యూనిట్‌ సంతోషం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో యాత్ర టీమ్‌ శనివారం ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిసింది. చిత్ర దర్శకుడు మహి వి రాఘవ, నిర్మాత విజయ్‌ చల్లాలు వైఎస్‌ జగన్‌ను కలిసారు. ఈ భేటీ అనంతరం దర్శకుడు రాఘవ మీడియాతో మాట్లాడారు. సినిమాకు వచ్చిన హిట్‌ టాక్‌ గురించి వైఎస్‌ జగన్‌ అడిగి తెలుసుకున్నారని, చిత్రంపై వస్తున్న ప్రేక్షకాదరణ పట్ల సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. జనాలు ఫోన్‌ చేసి చిత్రంపై ఫీడ్‌బ్యాక్‌ ఇస్తుంటే తనకు మాటలు రావడం లేదని ఆనందం వ్యక్తం చేశారు.

SHARE

LEAVE A REPLY