వినాయక్ కరోనా సాయం 5 లక్షలు

0
96

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్స్ క్యాన్సిల్ అయ్యాయ్. దీంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి సాయం చేసేందుకు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా మాస్ దర్శకుడు వివి వినాయక్ తన వంతు సాయంగా రూ. 5లక్షల విరాళం ఇచ్చారు. సీనియర్‌ నటుడు కాదంబరి కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో నడుస్తోన్న ‘మనం సైతం’ ఫౌండేషన్‌కు వినాయక్ రూ. 5 లక్షలు అందజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ట్విట్టర్ లో వీడియో షేర్ చేసారు వినాయక్.

‘ఈరోజు అందర్నీ వణికిస్తోన్న కరోనా వైరస్‌ను మన ఇళ్లల్లో మనం ఉండి వణికించాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలోని పేద కళాకారులు, టెక్నీషియన్లు, డాన్సర్లు, ఫైటర్లు.. ఎవరైనా కానివ్వండి.. నెల రోజుల పాటు షూటింగ్స్ లేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. వాళ్లకు నిత్యావసర వస్తువులను అందజేసే నిమిత్తం నా వంతుగా రూ. 5 లక్షల చెక్కును మనం సైతం కాదంబరి కిరణ్‌కుమార్‌కు అందజేస్తున్నా. నిజంగా ఎవరికి అవసరమో వారు కాదంబరి కిరణ్ గారిని సంప్రదించి, నిత్యావసర వస్తువులను తీసుకోవాల్సిందిగా కోరుతున్నా’నని తెలిపారు.

SHARE

LEAVE A REPLY