ప్రకాష్‌రాజ్‌కు విశాల్‌ మద్దతు

0
152

Times of Nellore (Brengaluru) # కోట సునీల్ కుమార్ # – బెంగుళూరు లోక్‌సభ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న సినీనటుడు ప్రకాష్‌రాజ్‌కు నడిగర్‌ సంఘ అధ్యక్షుడు, నటుడు విశాల్‌ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం విశాల్‌ ఒక వీడియో విడుదల చేస్తూ, ప్రస్తుత ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించడం చాలా కష్టమన్నారు. అందుకు ధైర్యంతో పాటు ప్రజలకు సేవ చేయాలనే ద్రుఢ సంకల్పం అవసరమన్నారు. అందుకు సరైన వ్యక్తిగా నటుడు ప్రకాష్‌రాజ్‌ నిలిచారని పేర్కొన్నారు. సమాజంలో జరిగే మంచి విషయాలను స్వాగతిస్తూ, చెడు విషయాలపై గళం విప్పుతున్న వ్యక్తిగా ప్రకాష్‌రాజ్‌ నిలిచారని కొనియాడారు. ఈ ఎన్నికల్లో విజయం సా ధించేందుకు ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయని, సెంట్రల్‌ బెంగుళూరు లోక్‌సభ స్థానంలో ‘విజిల్‌’ గుర్తుపై పోటీచేస్తున్న ఆయనకు తాను ‘విజిల్‌’ వేసి అభినందిస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి ప్రజల కోసం ఆయన గళం విప్పాలని, ఆ అవకాశాన్ని ఆ నియోజకవర్గ ఓటర్లు అందిస్తారని నమ్మకం ఉన్నట్లు విశాల్‌ పేర్కొన్నారు.

SHARE

LEAVE A REPLY