‘మహర్షి’ కి ఉపరాష్ట్రపతి ప్రశంస

0
107

Times of Nellore (Hyd) #కోట సునీల్ కుమార్ #  – సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘మహర్షి’ సినిమాపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసలు కురిపించారు. ఆయన కుటుంబ సభ్యులతో సినిమాను వీక్షించారు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా వెల్లడిస్తూ సినిమా పట్ల తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘కుటుంబసభ్యులతో కలిసి ‘మహర్షి’ సినిమా చూశా. గ్రామీణ ఇతివృత్తంతో, వ్యవసాయ పరిరక్షణను, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియజేసిన ప్రబోధాత్మక చిత్రం. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తుకుతెచ్చిన సినిమా ‘మహర్షి’. సహజమైన నటన కనబరిచిన కథానాయకుడు మహేశ్‌ బాబుకు, చక్కగా చిత్రీకరించిన దర్శకుడు వంశీ పైడిపల్లికి, నిర్మాతలతో పాటు చిత్రబృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు.

SHARE

LEAVE A REPLY