వాళ్ళందరూ సైతాన్లు అంటున్న సల్మాన్ ఖాన్.!

0
117

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది ప్రియాంక రెడ్డి అత్యాచారం ఘటన. సోషల్ మీడియాలో అయితే ప్రపంచంలో వివిధ దేశాలలో స్థిరపడిన భారతీయులు భారతదేశం అంటే ప్రపంచ దేశాలు భయపడి పోతున్నాయని ఇలాంటి ఘటనల వల్ల దేశానికి చెడ్డ పేరు వస్తుందని కొత్త చట్టాలు ప్రభుత్వాలు న్యాయస్థానాలు తీసుకురావాలని ఆడదాన్ని దేవతగా పూజించే దేశంలో ఇటువంటి దారుణంగా అత్యాచారం ఘటన జరగటం అమానుషమని కామెంట్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నేతలు సెలబ్రిటీలు తమదైన శైలిలో స్పందించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా స్పందించారు.

ఈ దారుణానికి ఒడిగట్టిన ఆ నలుగురు సైతాన్ లు అంటూ మనిషి రూపంలో వారు మనుషుల మధ్య తిరుగుతూ పిచ్చ పిచ్చ పనులు చేస్తున్నారు అంటూ డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారంపై స్పందించారు. అంతేకాకుండా తన ప్రగాఢ సానుభూతిని కుటుంబానికి తెలిపారు. సల్మాన్ ఖాన్ ట్విట్టర్ ద్వారా ప్రియాంక కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు. ప్రియాంకారెడ్డి హత్య కేసు నిందితులను ఉద్దేశిస్తూ.. ‘వారంతా మానవ రూపంలో మారువేషం వేసుకున్న సైతాన్లు.. నిర్భయ, ప్రియాంకారెడ్డిల మరణాలు.. వారిని అంతం చేయడం కోసం మనందరినీ ఒకటి చేశాయి.

‘లెట్ బేటీ బచావో’ను క్యాంపెయిన్‌లా మాత్రమే కాకుండా మనందరం ఒకటిగా నిలిచి.. ఆ రాక్షసులను అంతమొందించాలి. ప్రియాంక ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’ అటు సల్మాన్ ఖాన్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇంకా సల్మాన్ మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది తాజాగా జరిగిన ఘటనపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను జైల్లో పెట్టి భోజనం పెట్టకూడదని చంపేయాలని టైం వేస్ట్ చేయవద్దని వెంటనే పబ్లిక్ గా అందరూ చూస్తుండగానే శిక్ష విధించాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

SHARE

LEAVE A REPLY