త్రివిక్రమ్ తో సినిమా చేయనున్న చరణ్…??

0
96

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అల వైకుంఠుపురములో అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా, త్రివిక్రమ్ మరియు బన్నీల కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో, దీనిపై బన్నీ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను కమర్షియల్ హంగులతో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా త్రివిక్రమ్ దీనిని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

 

రాబోయే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ చేయబోయేది రామ్ చరణ్ తోనే అంటూ నేడు పలు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, నిన్న సైరా నరసింహారెడ్డి సినిమా ప్రత్యేక ఇంటర్వ్యూ లో భాగంగా మెగాస్టార్ ని మరియు చరణ్ ని ఇంటర్వ్యూ చేసిన త్రివిక్రమ్, ఆ సమయంలో చరణ్ కు ఒక మంచి స్టోరీ లైన్ వినిపించినట్లు చెప్తున్నారు. ఎప్పటినుండో తాను చరణ్ తో సినిమా చేయాలని భావిస్తున్నప్పటికీ సరైన కథ కుదరకపోవడంతో వీలుకాలేదని, ఇక ప్రస్తుతం తాను చెప్పిన కథ చరణ్ కు చాలాబాగా నచ్చడంతో త్రివిక్రమ్ ప్రస్తుతం చేస్తున్న అల వైకుంఠపురములో అనంతరం, దానిని తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారట.

ఇక మరోవైపు చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొంటుండడంతో, రాబోయే మరికొద్దిరోజుల్లోనే తమ సినిమాను ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారట. అన్ని కుదిరితే, రాబోయే జనవరిలో ఆ సినిమా ప్రారంభం అవుతుందని అంటున్నారు. అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఏప్రిల్ లో ప్రారంభం అవుతుందని, ఎందుకంటే అప్పటికి చరణ్, ఆర్ఆర్ఆర్ కు సంబంధించి తన పోర్షన్ షూటింగ్ మొత్తం పూర్తి చేస్తారని సమాచారం. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం రావలసి ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మాత్రం, చరణ్ ఫ్యాన్స్ కి ఇది పండుగ వార్తే అనాలి…!!

SHARE

LEAVE A REPLY