ఇంటి గుట్టును బయటపెట్టిన వారి పై చర్యలు తీసుకోబోతున్న త్రివిక్రమ్ ?

0
98

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల ‘అల వైకుంఠపురములో’ మూవీ కూడ కాపీ సినిమా అంటూ జరుగుతున్న ప్రచారం త్రివిక్రమ్ దృష్టి వరకు వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి. 1955 ప్రాంతాలలో విడుదలైన ‘ఇంటిగుట్టు’ మూవీ ఛాయలు ‘అల వైకుంఠపురములో’ కూడ కనిపిస్తాయి అన్న ప్రచారం మొదలు కావడంతో ఈ మూవీ వివరాలు తెలుసుకోవడానికి ఈ పాత సినిమా సిడిలు సంపాదించి చూడటానికి చాలామంది అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టేసారు.

ఈ వార్తలను ఇప్పటి వరకు త్రివిక్రమ్ ఖండించక పోవడంతో లీక్ అయిన ఈ వార్తలలో ఎన్నో కొన్ని నిజాలు ఉన్నాయి అన్న ప్రచారం మొదలైంది. ఇప్పుడు ఈ విషయాలను తెలుసుకున్న త్రివిక్రమ్ ఈమధ్య తన సహాయకులను అందర్నీ తన వద్దకు పిలిచి ఈ న్యూస్ ఎలా బయటకు లీక్ అయింది అని ప్రశ్నించినట్లు టాక్.

అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన ఏ లీక్ బయటకు వచ్చినా దాని బాధ్యత తన సహాయకులు వహించవలసి ఉంటుందని భవిష్యత్ లో ఇలాంటి లీకులు వస్తే తన సహాయకుల పై తీవ్ర చర్యలు తీసుకుంటానని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు వార్తలు గాసిప్పులుగా హడావిడి చేస్తున్నాయి. దీనితో ‘ఇంటిగుట్టు’ పేరు వినగానే త్రివిక్రమ్ ఎందుకు ఉలిక్కి పడుతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్ సినిమాలకు సంబంధించి కాపీ ఆరోపణలు రావడం సర్వసాధారణంగా మారిపోయింది. ‘అ ఆ’ ‘అజ్ఞాతవాసి’ సినిమాల విషయంలో ఈ కాపీ వివాదాలు తార స్థాయిలో జరగడంతో త్రివిక్రమ్ ఇమేజ్ కి ఈమధ్య కాలంలో బాగా డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు అలాంటి వివాదాలకు చాల దూరంగా ఉండాలని త్రివిక్రమ్ ఎన్నో ఆలోచనలు చేసి వ్రాసిన తన ‘అల వైకుంఠపురములో’ కథ విషయంలో కూడ కాపీ ఆరోపణలు రావడం పట్ల చాల సీరియస్ గా ఉన్నట్లు టాక్..

SHARE

LEAVE A REPLY