టైం, డేట్ ఫిక్స్ చేశా..ముంబై రాకుండా నన్ను ఆపండి: కంగనా

0
109

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- కాంట్రవర్సీస్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన కంగనా రనౌత్ సుశాంత్ మరణించినప్పటి నుండి కొందరు బాలీవుడ్ స్టార్స్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులకి తన మాటలతో నిద్ర పట్టకుండా చేస్తుంది. అధికార పార్టీ నాయకులపై కూడా కంగనా మాటల దాడి చేస్తుండడంతో ఈ వ్యవహారం కాక పుట్టిస్తుంది.లాక్ డౌన్ విధించినప్పటి నుండి మనాలిలో ఉంటున్న కంగనాను ముంబయికి ఇకపై రానిచ్చేది లేదు అంటూ కొందరు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కంగనా తన ట్విట్టర్ ద్వారా స్పందించింది. నేను ఈనెల 9న ముంబయిలో ల్యాండ్ అవ్వబోతున్నాను. ముంబయి ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యే సమయాన్ని కూడా నేను చెప్తాను. ఎవడి అబ్బకు అయినా దమ్ముంటే వచ్చి నన్ను ఆపండి అంటూ సవాల్ విసిరింది కంగనా

 

SHARE

LEAVE A REPLY