ఆ స్టూడియో అధినేత నన్ను రేప్ చేశాడు.. ప్రముఖ హీరోయిన్ ఆరోపణ

0
628

Times Of Nellore (cinema) :ఓ స్టూడియో అధినేత తనను రేప్ చేశాడని ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ రోజ్ మెక్ గోవాన్ ఆరోపించారు. ‘ది దూమ్ జనరేషన్’ హీరోయిన్ అయిన 43 ఏళ్ల రోజ్ ఈ మేరకు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. హాలీవుడ్‌లో ఇది బహిరంగ రహస్యమేనని తెలిపారు. తనను రేప్ చేసిన వాడిని మీడియా పొగుడుతూ తనను అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన మాజీ భాగస్వామి తమ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఆ రేపిస్ట్‌కు అమ్మేశాడని తెలిపారు. అయితే తనపై అత్యాచారానికి పాల్పడిన స్టూడియో యజమాని ఎవరన్న విషయాన్ని మాత్రం ఆమె చెప్పలేదు. రేప్ విషయాన్ని తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. అతడిపై మనం విజయం సాధించలేమని మహిళా క్రిమినల్ అటార్నీ ఒకరు చెప్పడంతో ఫిర్యాదుకు వెనకంజ వేసినట్టు రోజ్ చెప్పారు. ‘‘ఆ సినిమాలో ఓ సెక్స్ సీన్‌ చేసిన కారణంగా స్టూడియో అధినేతకు వ్యతిరేకంగా కేసు వేసి గెలిచే అవకాశం లేదు’’ అని ఓ మహిళా క్రిమినల్ అటార్నీ పేర్కొన్నారు అని రోజ్ వివరించారు.

SHARE

LEAVE A REPLY