చరిత్రను తిరగరాసిన గౌతమి పుత్ర శాతకర్ణి

0
624

Times of Nellore ( Cinema News ) – సింహం మరోసారి జూలు విదిల్చింది… లెజెండ్ చిత్రంతో తన చిత్రాల రికార్డులను తనే బద్దలు కొట్టిన నందమూరి నటసింహం భాలకృష్ణ, గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంతో మరో సారి రికార్డుల చరిత్రను బ్రేక్ చేయనున్నారు. ఎలాంటి చిత్రమైనా నటనలో తన తర్వాతే ఎవ్వరైనా అని నిరూపించారు. ఇవాళ విడుదలైన గౌతమి పుత్ర శాతకర్ణి, తెలుగు చిత్ర పరిశ్రమకు ఓ మైలురాయిగా మిగిలిపోనుంది. విదేశీయుల పాలనలో ముక్కలు చెక్కలుగా ఉన్న భారతదేశాన్ని స్వదేశీ సామంత రాజులతో ఐక్యం చేసిన తెలుగు మహారాజుగా గౌతమి పుత్ర శాతకర్ణి చరిత్రను నందమూరి భాలయ్య ద్వారా కళ్లకు కట్టినట్లు చూపారు దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ ( క్రిష్ ).

విదేశీయుల కనుసన్నల్లో ఓ ప్రాంతాన్ని పాలించే రాజుపై శాతకర్ణి దండయాత్ర చేయడం ద్వారా చిత్రం ఆరంభమవుతుంది. సముద్ర జలాల్లో సాగే ఆ పోరాట దృశ్యాలలో చక్కగా ఒదిగిపోయారు నందమూరి భాలకృష్ణ. తన వీరోచిత పోరాటంతో ఆ రాజును గెలిచి, ఆ ప్రాంతాన్ని కైవలం చేసుకొని, ఆ రాజునే ఆ ప్రాంతానికి సామంతు రాజుగా నియమిస్తాడు శాతకర్ణి. అక్కడి నుండి ప్రారంభమయ్యే ఆ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే యుద్ధం సన్నివేశాలను కూడా క్రిష్ అద్భుతంగా తెరకెక్కించారు.

ఇంటర్వెల్ తర్వాత కూడా తల్లి గొప్పతనాన్ని చాటి చెప్పే కథాంశాలు. విదేశీయుల వద్ద బందీలుగా ఉన్న సామంతు రాజుల బిడ్డల గాధలు, చివరన విదేశీ పాలనపై దండయాత్ర చేసి యుద్ధంలో వారిని ఓడించి దేశంలోని అన్నీ ప్రాంతాలను ఐక్యం చేసి, అమరావతి కేంద్రంగా సార్వభౌమ్య రారాజుగా శాతకర్ణి పాలించిన దృశ్యాలను చక్కగా తీర్చిదిద్దారు దర్శకులు క్రిష్. నటనలో ఏమాత్రం తీసిపోని విధంగా భాలకృష్ణ రాణించారు. గుర్రపు స్వారీలతో ప్రేక్షకులను కట్టిపడేశారు. నేపద్య సంగీతం అద్భుతంగా అందించారు సంగీత దర్శకులు చిరంతన్ భట్. పాటలు ప్రత్యేకతను చాటుకున్నాయి. హీరోయిన్ పాత్రలో నటించిన శ్రియ కూడా వశిష్ఠ దేవి పాత్రలో చక్కగా కుదిరిపోయింది. భాలకృష్ణకు తల్లిగా నటించిన బాలీవుడ్ అందాల తార హేమమాలిని చిత్రానికి ఐకాన్ గా నిలిచింది.

ఈ చిత్రంలో దర్శకుడు క్రిష్ గురించే ఎక్కువగా చెప్పుకోవాలి. పోరాట సన్నివేశాలను హాలీవుడ్ కు ధీటుగా తెరకెక్కించారు. కేవలం 78 రోజుల్లో షూటింగ్ ను పూర్తి చేసి. అతి తక్కువ గ్రాఫిక్స్ తో చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. సాక్షాత్తూ బాహుబలి చిత్ర దర్శకులు రాజమౌళి ఈ చిత్రాన్ని చూసి క్రిష్ ను ఆకాశానికి ఎత్తేశారు. తాను బాహుబలి చిత్రాన్ని మూడేళ్లు తీశానని, క్రిష్ కేవలం 78 రోజుల్లో షూటింగ్ ను పూర్తి చేసి, శాతకర్ణి చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారని మీడియాతో అన్నారు. క్రిష్ వద్ద తాను చాలా నేర్చుకోవాల్సి ఉందని రాజమౌళే అంటుంటే ఇక ఈ చిత్రం ఎంత పెద్ద హిట్టో అర్ధమయిపోతుంది. చరిత్రలో గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం నిలిచిపోతుంది.

SHARE

LEAVE A REPLY