‘అదిరిపోయే గిఫ్ట్ ఇస్తున్నా బ్రదర్ కాచుకో – తారక్ తో చరణ్!!

0
73

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒‘మాహిష్మతి’ పేరిట ఒక సామ్రాజ్యాన్నే సృష్టించి ప్రపంచ వ్యాపితం చేశాడు జక్కన్న రాజమౌళి. ఇప్పుడు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి శీతారామరాజు, కొమరం భీమ్ వీర పరాక్రమాలు వెండితెరపై చూపించేందుకు పెద్ద యుద్ధమే చేస్తున్నాడు. ఈ సినిమా షూట్ కొవిడ్ లాక్ డౌన్ కారణంగా వాయిదాపడి ఇప్పుడు మళ్లీ మొదలైంది. ఈ నేపథ్యంలో టీం మొత్తం మాంచి హుషారులో ఉంది. ఈ నేపథ్యంలో రామరాజు, కొమరం భీం పాత్రలు పోషిస్తోన్న రాంచరణ్, తారక్ ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. కొన్ని నెలల తర్వాత మళ్లీ షూటింగ్ లో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పిన చరణ్.. ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ ‘మై డియర్ తారక్ బ్రదర్… మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తోంది ఇప్పుడు నిజమవుతోంది. నేను నీకు మాటిచ్చిన విధంగా అక్టోబర్ 22న నీకు మంచి గిఫ్ట్ ఇస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

దీనికి ఎన్టీఆర్ బదులిస్తూ.. మళ్లీ సెట్స్ మీదకు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. అయితే, ‘బ్రదర్ చరణ్.. అక్టోబర్ 22 వరకు నేను వెయిట్ చేయలేకపోతున్నా’ అని ట్వీట్ చేశాడు. ఇదిలాఉంటే, ‘రామరాజు ఫర్ భీమ్’ వీడియోను ఈ నెల 22న విడుదల చేయబోతున్నట్టు దర్శకనిర్మాతలు వెల్లడించారు. ఈ విషయాన్ని చరణ్ కూడా వెల్లడిస్తూ షూటింగ్ పున:ప్రారంభానికి సంబంధించిన వీడియో పోస్ట్ చేశాడు.

SHARE

LEAVE A REPLY