దుమ్మురేపుతున్న “సర్కార్” కలెక్షన్స్

0
181

Times o Nellore  (Cinema) –  సూర్య: ఇళయ దళపతి విజయ్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న విజయ్‌ సినిమా రిలీజ్‌ అవుతుంటే బాక్సాఫీస్‌ బద్దలవ్వాల్సిందే. మెర్సల్‌ (తెలుగులో ‘అదిరింది’) చిత్రంతో బాక్సాఫీస్‌ రికార్డును క్రియేట్‌ చేసిన విజయ్‌.. తాజాగా సర్కార్‌తో మరోసారి తన హవాను చూపిస్తున్నాడు.

మంగళవారం రిలీజ్‌ అయిన సర్కార్‌ రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. చెన్నైలో దాదాపు 70 స్ర్కీన్‌లో విడుదల చేయగా, 2.41కోట్లు కలెక్ట్‌ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఓవర్సిస్‌లో సైతం సర్కార్‌ సునామిని సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాలో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని రిలీజ్‌చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మొదటిరోజు 2.32కోట్లు కలెక్ట్‌ చేసినట్టు సమాచారం. కేవలం చెన్నైలోనే కాకుండా తమిళనాడు వ్యాప్తంగా ఈ చిత్రం వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. కొంత నెగెటివ్‌ టాక్‌ వచ్చినప్పటికీ.. అవేవి ఈ సినిమాపై ప్రభావాన్ని చూపెట్టలేకపోతున్నాయి. కీర్తి సురేష్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించాడు.

SHARE

LEAVE A REPLY