సినీనటుడు సునీల్‌కు మరో ఛాన్స్‌

0
96

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- సినీనటుడు సునీల్‌ కమెడియన్‌ నుంచి హీరోగా మారిన మొదట్లో మంచి హిట్లు కొట్టాడు. ఆ తర్వాత వరుస అపజయాలు అతన్ని వెంటాడుతునే ఉన్నాయి. దీంతో మళ్లీ కామెడికే పరితమయ్యాడు. అరవింద సమేత, అలా వైకుంఠపురం చిత్రాల్లో కమెడియన్‌గా నటించాడు. అయినా సరే సునీల్‌కు కాలం కలిసి రాలేదు. తనలో టాలెంట్‌ను నిరూపించేందుకు సునీల్‌కు మళ్లీ ఒక ఛాన్స్‌ వచ్చింది. గోపిచంద్‌, తమన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సీటీమార్‌ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించడం కోసం చిత్ర దర్శకుడు సంపత్‌ నంది సునీల్‌ను తీసుకున్నాడని సమాచారం.

మరీ ఈ సినిమాతో అయినా సునీల్‌ తన ట్యాలెంట్‌ను నిరూపించుకుంటాడో లేదో చూద్దాం. గోపిచంద్‌, సంపత్‌ నంది కాంబినేషన్‌లో ఇది రెండో చిత్రం కాబట్టి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

SHARE

LEAVE A REPLY