కొనసాగుతున్న “మా” ఎన్నికలు

0
252

Times of Nellore (Hyd) # కోట సునీల్ కుమార్ # – మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌ ఎన్నికలు ఈ సారి రసవత్తరంగా మారాయి. అధ్యక్ష పదవి కోసం నరేష్‌, శివాజీ రాజాలు పోటి పడుతున్నారు. ఈ రోజు (ఆదివారం) ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఫిలిం ఛాంబర్‌లో పోలింగ్‌ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో మా లో సభ్యులుగా ఉన్న దాదాపు 800 మంది నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ఛాంబర్‌లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ సారి ఎలక్షన్లు ఎన్నడూ లేనంత ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రధాన ప్రత్యర్థులు శివాజీ రాజా, నరేష్‌లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటంతో పోటి రసవత్తరంగా మారింది. గత ఎన్నికల్లో శివాజీ రాజాకు మద్ధతు తెలిపిన మెగా ఫ్యామిలీ ఈ సారి నరేష్‌ ప్యానల్‌కు మద్ధతుగా నిలవటంతో ఫలితం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. సాయంత్రం 5గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రాత్రి 8 గంటలకల్లా ఫలితాలు వెళ్లడించే అవకాశం ఉంది.

SHARE

LEAVE A REPLY