‘మహర్షి’ హిందీ రీమేక్‌లో స్టార్‌ హీరో?

0
262

Times of Nellore (Cinema) #కోట సునీల్ కుమార్ # – సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ‘మహర్షి’ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించడంతో పాటు ప్రేక్షకుల ఆదరణ సైతం పొందింది. ఈ నేపథ్యంలో ఇతర భాషల్లో సినిమాను రీమేక్‌ చేయడానికి డిమాండ్‌ నెలకొంది. ఇప్పటికే తమిళ రీమేక్‌కు సన్నాహాలు ప్రారంభమయ్యాయట. ఇందులో విజయ్‌ కథానాయకుడి పాత్ర పోషించబోతున్నట్లు తెలిసింది. కాగా హిందీలోనూ ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కోసం నిర్మాతలు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయబోతున్నారట. ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు, నటుడు ప్రభుదేవాతోపాటు సల్మాన్‌ సినిమా వీక్షించనున్నట్లు తెలిసింది. సినిమా సల్మాన్‌కు నచ్చితే రీమేక్‌కు ప్లాన్‌ చేయబోతున్నట్లు చెబుతున్నారు.

బాలీవుడ్‌లో పాపులర్‌ హీరోగా ఎదిగిన సల్మాన్‌కు ఓ సందర్భంలో తెలుగు సినిమా రీమేక్‌ బ్రేక్‌ ఇచ్చింది. ఆయన కెరీర్‌ పరంగా అపజయాలు ఎదుర్కొంటున్న సమయంలో మహేశ్‌బాబు ‘పోకిరి’ హిందీ రీమేక్‌ ‘వాంటెడ్‌’లో నటించారు. 2009లో విడుదలైన ఈ సినిమా ఆయన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ‘మహర్షి’ రీమేక్‌కు కూడా సల్మాన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉందని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.

SHARE

LEAVE A REPLY