సరిలేరు నీకెవ్వరులో ఆ సీనుకి థియేటర్లల్లో అందరూ లేచి నిలబడి మరి..?

0
163

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –అనిల్ రావిపూడి దర్శకత్వంలో అనిల్ సుంకర,హీరో మహేష్ బాబు ,దిల్ రాజు నిర్మాతలుగా ఏకే ఎంటర్ ట్రైన్మెంట్ ,శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ,జీ మహేష్ బాబు ఎంటర్ ట్రైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా.. సీనియర్ నటులు ప్రకాష్ రాజ్,రాజేంద్రప్రసాద్ ,విజయశాంతి,సంగీత నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు.

ఈ మూవీ శనివారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ మూవీ బెనిఫిట్ షో దగ్గర నుండి హిట్ టాక్ తో కలెక్షన్ల సునామీని కురిపిస్తుంది. ఈ మూవీలో కర్నూల్ కొండారెడ్డి బురుజు దగ్గర మహేష్ చేసిన యాక్షన్ కు ..డైలాగ్ డిలవరికి అందరూ ఫిదా అయినట్లు సినిమా చూసినవాళ్లంతా చెబుతున్నారు. ఆ సీనులో విజయశాంతిని చంపమని ఒక విలన్ మరో విలన్ అయిన అజయ్ కు గొడ్డలి విసురుతాడు.

ఆ గొడ్డలిని అందుకున్న అజయ్ విజయశాంతి,ఆమెతో పాటున్న పిల్లలపై విసురుతాడు. మొదటిసారి ఆ సీను చూసినవాళ్లకు ఆ గొడ్డలి విజయశాంతికి తగులుతుంది. పెద్ద గాయమే అయి సినిమాలో ట్విస్ట్ ఉంటుంది అని అందరూ అనుకున్నారు. అయితే అందర్నీ అంచనాలను పటపంచాలు చేస్తూ మహేష్ బాబు ఎంట్రీస్తాడు.

పోకిరీ మూవీలో తన తండ్రి నాజర్ చనిపోయినప్పుడు ఎలా అయితే మహేష్ వస్తాడో ,అలా ఎంట్రీ ఇచ్చి ఆ గొడ్డలిని క్యాచ్ పట్టుకుని ఫైట్ చేస్తాడు. ఈ సీనుకు థియేటర్లలో అందరూ లేచి నిలబడి చప్పట్లు.. పేపరర్లు చల్లుతూ విజిల్స్ వేశారు అని అంటున్నారు సినీ ప్రేక్షకులు. మహేష్ సినిమా మజకా..?

SHARE

LEAVE A REPLY